Published on May 30, 2025
Current Affairs
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అతుల్‌ ఎస్‌.చందూర్కర్‌లు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా లాంఛనంగా నియమితులయ్యారు. ఈ మేరకు  2025, మే 29న వారి నియామకాలను కేంద్రం ఖరారుచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ మే 30న వారి చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓక్, జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌ల పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నియామకం జరిపారు.