చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) దేశ వ్యాప్తంగా ఉన్న సిపెట్ కేంద్రాల్లో సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025 ద్వారా డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సులు:
1. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ: మూడేళ్ల వ్యవధి
2. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ: మూడేళ్ల వ్యవధి
3. పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్/ క్యామ్: ఏడాదిన్నరేళ్ల వ్యవధి
4. పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ & టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ): రెండేళ్ల వ్యవధి
అర్హత: కోర్సును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: గరిష్ఠ వయసు పరిమితి లేదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.500; ఎస్సీ/ఎస్టీలకు రూ.250.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18.12.2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.05.2026.
అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్: 03.06.2026.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 07.06.2026.
Website:https://www.cipet.gov.in/404.php