భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) ఒప్పంద ప్రాతిపదకన ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 8
వివరాలు:
1. అసోసియేట్ ప్రొఫెసర్- 02
2. అసిస్టెంట్ ప్రొపెసర్- 06
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.46,400; అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.35,000- రూ.40,000.
వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు చివరి తేదీ: 28.03.2026.