ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ కాంస్యం నెగ్గాడు. 2025, మార్చి 25న అమ్మాన్ (జోర్డాన్)లో జరిగిన గ్రీకో రోమన్ 87 కేజీల విభాగం కాంస్య పతక పోరులో అతడు 5-1తో జియాగ్జిన్ హంగ్ (చైనా)ను ఓడించాడు.
ప్రస్తుత ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. మొత్తంగా సునీల్‌కు ఇది అయిదో ఆసియా ఛాంపియన్‌షిప్ మెడల్.