భారత సైన్యానికి కే9 వజ్ర మర ఫిరంగులను ఎల్ అండ్ టీ సరఫరా చేయనుంది.
ఇందుకోసం రూ.7,628 కోట్ల కాంట్రాక్టు సంస్థకు లభించింది.
అత్యంత కచ్చితత్వంతో, ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఇవి ఉపయోగ పడతాయని రక్షణ శాఖ తెలిపింది.
దేశ సరిహద్దుల్లో మోహరించేందుకు 100 వజ్ర ఫిరంగులను రక్షణ శాఖ సమీకరించనుంది.