Published on Jun 18, 2025
Admissions
సినిమా అండ్‌ టెలివిజన్‌లో ఎంఎఫ్‌ఏ అండ్‌ పీజీ సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు
సినిమా అండ్‌ టెలివిజన్‌లో ఎంఎఫ్‌ఏ అండ్‌ పీజీ సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు

పుణెలోని ఫిల్మ్ & టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) 2025-26 విద్యాసంవత్సరానికి సినిమా, టెలివిజన్ రంగాల్లో ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఎంఎఫ్‌ఏ), ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ రైటింగ్, ఎడిటింగ్, సౌండ్‌ రికార్టింగ్ ఇలా తదితర రంగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు: 

ఫిల్మ్‌ వింగ్‌ (ఎంఎఫ్‌ఏ - మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌)

1. డైరెక్షన్ & స్క్రీన్‌ప్లే రైటింగ్: 11

2. సినిమాటోగ్రఫీ: 11

3. ఎడిటింగ్: 11

4. సౌండ్ రికార్డింగ్ & డిజైన్: 11

5. ఆర్ట్ డైరెక్షన్ & ప్రొడక్షన్ డిజైన్: 11

6. స్క్రీన్ యాక్టింగ్: 16

7. స్క్రీన్‌రైటింగ్ (ఫిల్మ్, టీవీ & వెబ్‌ సిరీస్): 16

టెలివిజన్‌ వింగ్‌ (ఏడాది పీజీ సర్టిఫికేట్‌ కోర్స్‌)

కోర్సు పేరు : సీట్లు

1. టీవీ డైరెక్షన్: 11

2. ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ: 11

3. వీడియో ఎడిటింగ్: 11

4. సౌండ్ & టీవీ ఇంజినీరింగ్: 11

అర్హత: 

ఎంఎఫ్‌ఏ కోర్సులకు: ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు (ఆర్ట్‌ డిజైన్‌ కోర్సుకు ఫైన్స్‌ ఆర్ట్స్‌ సంబంధిత బ్యాక్‌గ్రౌండ్ తప్పనిసరి).

ఏడాది పీజీ కోర్సుకు: ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు. కాని ప్రవేశ సమయంలో డిగ్రీ పూర్తయి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఒక్క కోర్సుకు రూ.1500 (జనరల్‌/ఓబీసీ), (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. రెండు కోర్సులకు రూ.2500, రూ.800. నిఫ్టెమ్‌లో బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌

పరీక్ష కేంద్రాలు: 

దేశవ్యాప్తంగా 26 కేంద్రాల్లో.. దిల్లీ, ముంబయి, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, పుణె, బెంగళూరు, లఖ్‌నవూ, రాంచీ, విజయవాడ తదితర నగరాల్లో.

ప్రవేశం రెండు దశల్లో: స్టేజ్‌-1 (రాత పరీక్ష) & స్టేజ్‌-2 (అభినయం/ ప్రాక్టికల్/ ఇంటరాక్షన్).

ప్రవేశ పరీక్షలో పేపర్‌-I (60 మార్కులు- అబ్జెక్టీవ్‌), పేపర్‌-II (40 మార్కులు- సబ్జెక్టీవ్‌).

ఒకే అభ్యర్థి 2 కోర్సులకు దరకాస్తు చేయవచ్చు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11.07.2025.

ప్రవేశ పరీక్ష (స్టేజ్‌-1): 27 జులై 2025.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 20 జులై - 26 జులై 2025

క్లాసులు ప్రారంభం: 2025 నవంబర్ మూడో వారం (అంచనా)

ముఖ్యాంశాలు:

Website:https://ftii.ac.in/announcement