అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు.
స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ 2025, మార్చి 18న వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది.
సునీత, విల్మోర్‌లతోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్‌ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు.
కేవలం 8 రోజుల యాత్ర కోసం 2024, జూన్ 5న ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీత, విల్మోర్.. చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది.
గుజరాత్‌లోని మెహ్‌సాణా జిల్లా ఝూలాసన్‌లో సునీత పూర్వీకులు ఉంటున్నారు. సునీత తండ్రి దీపక్ పాండ్యా 1957లో ఝూలాసన్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.