Published on Mar 11, 2025
Current Affairs
సైనిక దళాల శౌర్య యాత్ర
సైనిక దళాల శౌర్య యాత్ర

సైనిక దళాల సుదీర్ఘ మోటార్‌ సైకిల్‌ యాత్ర 2025, మార్చి 10న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన చాంగ్‌లాంగ్‌ జిల్లా విజయ్‌ నగర్‌లో ప్రారంభమైంది.

3,900 కిలోమీటర్ల దూరం సాగనున్న ఈ శౌర్య యాత్ర గుజరాత్‌లోని రణ్‌ ఆఫ్‌ కచ్‌లో ముగియనుంది. ఐక్యత, సాహసం, దేశభక్తి పేరుతో ఈ యాత్ర సాగుతోంది.

ఈ యాత్రను విజయ్‌ నగర్‌లో నివసిస్తున్న 90 ఏళ్ల అస్సాం రైఫిల్స్‌ మాజీ ఉద్యోగి పదమ్‌ సింగ్‌ జెండా ఊపి ప్రారంభించారు. 

ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ్‌ భారత్‌లో భాగంగా రక్షణ విభాగం ఈ యాత్రను నిర్వహిస్తోంది. యాత్రలో అస్సాం రైఫిల్స్, భారతీయ సైన్యం సిబ్బందితోపాటు అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన నలుగురు పౌరులు పాల్గొన్నారు.