అతి శీతల వాతావరణంలో సైనికులు ధరించే సరికొత్త సైనిక జాకెట్ ‘‘కోట్ కంబాట్’’ను భారత సైన్యం రూపొందించింది. డిజిటల్ ప్రింట్‌తో కూడుకున్న ఈ జాకెట్‌కు సంబంధించి మేధో ఆస్తి హక్కుల్ని (పేటెంట్ రైట్స్) భారత సైన్యం దక్కించుకుంది.
దిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టి) దీన్ని రూపొందించిందని రక్షణ శాఖ వర్గాలు 2025, నవంబరు 19న వెల్లడించాయి. సైన్యం ఈ జాకెట్‌ను 2025, జనవరిలో ప్రవేశపెట్టింది.