కమ్యూనికేషన్లను వేగంగా సాగించడానికి, సైనిక కార్యకలాపాలకు ఉపయోగించడానికి జపాన్ 2024, నవంబరు 4న కిరామెకి-3 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. కొత్తగా రూపొందించిన హెచ్3 రాకెట్‌ను ఇందుకోసం ఉపయోగించింది.
తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
ఇది సమాచారం, డేటా బదలాయింపు, సైనిక కార్యాకలాపాల కోసం ఎక్స్-బ్యాండ్ కమ్యూనికేషన్‌ను ఉపయోగిస్తుంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కమ్యూనికేషన్లు సాగించడానికి ఇది దోహదపడుతుంది.