ఆసియా స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ టీమ్ స్వర్ణం గెలుచుకుంది. 2025, జూన్ 28న కొలంబోలో జరిగిన ఫైనల్లో పంకజ్ అడ్వాణీ-బ్రిజేశ్ దమానిలతో కూడిన భారత్ 3-1తో మలేసియాను ఓడించింది. తొలి గేమ్‌లో దమాని 58-68తో హోన్ మాన్ చేతిలో ఓడగా.. తర్వాత పంకజ్ 66-25తో లిమ్ లియాంగ్‌ను ఓడించి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. కీలక డబుల్స్‌లో పంకజ్-దమాని జంట 76-33తో తిమ్ చౌన్-లిమ్ జోడీని ఓడించి భారత్‌కు విజయాన్ని అందించింది.