భారత నౌకాదళానికి 40 ఏళ్ల పాటు సేవలందించిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధుఘోష్ ఇక శాశ్వతంగా విశ్రాంతి తీసుకోనుంది. 2025, డిసెంబరు 20న దీన్ని లాంఛనంగా నేవీ నుంచి ఉపసంహరించారు. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.