2034 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతుంది. ఈ విషయాన్ని ఫిఫా 2024, డిసెంబరు 11న అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ ప్రపంచకప్ నిర్వహణ కోసం 15 నెలల పాటు సాగిన బిడ్ ప్రక్రియలో సౌదీ మాత్రమే ఆసక్తి ప్రదర్శించింది.
మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఫిఫా అధ్యక్షుడు గియాన్ని ఇన్‌ఫాంటినో అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో ఆతిథ్య హక్కులను సౌదీకి కట్టబెట్టారు.
అలాగే 2030 ప్రపంచకప్‌ను ఆరు దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. స్పెయిన్, పోర్చుగల్, మొరాకోలో ఎక్కువ మ్యాచ్‌లు జరుగనుండగా.. అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే ఒక్కో మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తాయి.