విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏర్పడిన ఒక పాలపుంతలో ఆక్సిజన్, భార మూలకాలు ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భూమికి 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
దీనికి జేడ్స్-జీఎస్-జడ్14-0 అని పేరుపెట్టారు. విశ్వం పుట్టిన మొదట్లో కాకుండా చాలా ముందుగానే పాలపుంతలు ఏర్పడినట్లు ఈ ఆధారాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు 700 సుదూర పాలపుంతల్ని సర్వే చేయగా వాటిలో మూడో అతిపెద్దది ఇదేనని తేలింది.