Published on Apr 20, 2025
Current Affairs
సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు
సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు

మన దేశం నుంచి సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు 2024-25లో 665.96 మిలియన్‌ డాలర్ల (రూ.5,700 కోట్ల)కు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023-24లో ఎగుమతి చేసిన 494.8 మి.డాలర్ల (సుమారు రూ.4,200 కోట్ల) ఉత్పత్తులతో పోలిస్తే ఇవి 34.6% ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన పప్పుధాన్యాలు, వంటనూనె, తాజా ఫలాలు, కూరగాయలకు గిరాకీ పెరగడమే ఇందుకు కారణం. పరిమాణం పరంగా చూస్తే ఎగుమతులు 4% పెరిగి 3,68,155 టన్నులకు చేరాయి.