దేశరాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2025, డిసెంబరు 25న జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంథాలీ భాషలో భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. దేశంలో మనుగడలో ఉన్న అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన సంథాలీని 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చారు. ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో గిరిజనులు ఈ భాషను మాట్లాడతారు.