Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 16, 2026
Apprenticeship
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

సౌత్‌ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్‌) సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, పర్సనల్‌, ఎస్‌ అండ్ టీ విభాగాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం అప్రెంటిస్‌ పోస్టులు: 2,801

వివరాలు:

విభాగాలు: ఏసీ మెకానిక్‌, కార్పెంటర్‌, సీఓపీఏ, డీసిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌, మెషినిస్ట్‌, ఎంఎంటీఎం, మోటర్‌ మెకానిక్‌, పెయింటర్‌, వెల్డర్‌.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2026 ఏప్రిల్ 11వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 11.

Website: https://scr.indianrailways.gov.in/?lang=1