Published on Jan 6, 2026
Government Jobs
సౌత్ ఈస్ట్రన్‌ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
సౌత్ ఈస్ట్రన్‌ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు

కోల్‌కతాలోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- సౌత్ ఈస్ట్రన్‌ రైల్వే 2025-26 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 54.

వివరాలు:

1. గ్రూప్‌-సి (లెవెల్‌-4, లెవెల్‌-5): 05

2. గ్రూప్‌-సి (లెవెల్‌-2/3): 16

3. గ్రూప్‌-డి (లెవెల్‌-1): 33

అర్హత: పోస్టులను అనుసరించి డిగ్రీ, పన్నెండో తరగతి, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉండాలి.

క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, వాటర్ పోలో, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్ తదితరాలు.

వయోపరిమితి: 01/01/2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10-01-2026.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09-02-2026.

Website:https://rrcser.co.in/notice.html