కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్), బిలాస్‌పుర్, వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఒక ఏడాది అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 100
వివరాలు:
1. ఆఫీస్ అసిస్టెంట్: 25
2. జనరల్ డ్యూటీ అసిస్టెంట్: 20
3. అసిస్టెంట్ మైన్ సర్వేయర్: 25
4.సెక్యూరిటీ గార్డ్: 30
విభాగాలు: ఆఫీస్ ఆపరేషన్స్, మైనింగ్ సర్వే, జనరల్ డ్యూటీ, సెక్యూరిటీ సర్వీసెస్.
అర్హత: సంబంధిత ట్రేడ్‌ల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.8,200.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ (మార్కుల శాతం) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 31-03-2026.