సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) 2024, సెప్టెంబరు 12న దిల్లీలో మరణించారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సీపీఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తిగా ఆయన పేరొందారు. ఆ పదవిలో ఉండగానే కన్నుమూసిన తొలి నాయకుడిగా మిగిలారు. 1952 ఆగస్టు 12న మద్రాస్ (చెన్నై)లో ఏచూరి జన్మించారు.
రాజకీయ ప్రస్థానం:
* 1974లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేతగా ‘భారత విద్యార్థి సమాఖ్య’ (ఎస్‌ఎఫ్‌ఐ)లో ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1984లో సీపీఎం సెంట్రల్ కమిటీలో సభ్యుడయ్యారు. 1992లో పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు.
* 2005-17 మధ్య 12 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.
* 2015 ఏప్రిల్ 19న విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకాశ్ కారాట్ స్థానంలో సీతారాం ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2018, 2022ల్లోనూ ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు.