Published on Nov 14, 2024
Current Affairs
సంతానం ఎక్కువ ఉన్నా ఎన్నిక పోటీల్లో అర్హులే
సంతానం ఎక్కువ ఉన్నా ఎన్నిక పోటీల్లో అర్హులే

ఇద్దరి కంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లులను ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 2024, నవంబరు 13న ఏకగ్రీవంగా ఆమోదించింది.

కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులని చట్టం చేశారు.  కాలక్రమంలో సంతానోత్పత్తి రేటు తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగింది. 

ఈ నేపథ్యంలో సంతానోత్పత్తిపై నియంత్రణను ఎత్తి వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరి కంటే ఎక్కువ సంతానంగల వారు అనర్హులన్న పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లులను శాసనసభ ఆమోదించింది.