బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 91.
వివరాలు:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్: 52 పోస్టులు
2. ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్ పార్ట్‌నర్: 04 పోస్టులు3. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ మాడ్యూల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడర్- సిస్టమ్ సాఫ్ట్‌వేర్/ కంపైలర్/ డీబగ్గర్: 35 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-12-2024.
Website:https://careers.cdac.in/advt-details/HY-12112024-1UXD8