లఖ్‌నవూలోని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి), ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా సిడ్బి కార్యాలయాల్లో గ్రేడ్-ఎ, గ్రేడ్-బి కేటగిరీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 72.
వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ (జనరల్): 50 పోస్టులు
2. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-బి (జనరల్): 10 పోస్టులు
3. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-బి (లీగల్): 06 పోస్టులు
4. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-బి (ఐటి): 06 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్(సీఎస్/ ఐటీ/ ఈసీసీ), ఎల్‌ఎల్‌బీ, సీఏ, సీఎస్, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 08-11-2024 నాటికి గ్రేడ్- ఎ కేటగిరీకి 21 – 30; గ్రేడ్- బి కేటగిరీకి 25- 33 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు గ్రేడ్- ఎ కేటగిరీకి సుమారుగా రూ.44500-రూ.1,00,000. గ్రేడ్-బి కేటగిరీకి సుమారుగా రూ.55200-రూ.1,15,000.
ఎంపిక విధానం: ఫేజ్-I (ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష), ఫేజ్-II (ఆన్‌లైన్ పరీక్ష), ఫేజ్-III (ఇంటర్వ్యూ), ఆన్‌లైన్ సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఫేజ్-I పరీక్షలోని అంశాలు: ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (20 ప్రశ్నలు- 20 మార్కులు), ఎంఎస్‌ఎంఈ (30 ప్రశ్నలు- 30 మార్కులు), స్ట్రీమ్ స్పెసిఫిక్ టెస్ట్ (50 ప్రశ్నలు- 50 మార్కులు).
పరీక్ష సమయం: 120 నిమిషాలు. పరీక్ష కాల వ్యవధి- 120 నిమిషాలు.
దరఖాస్తు రుసుము: రూ.1100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఫీజు చెల్లింపు చివరి తేది: డిసెంబర్ 02, 2024.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ (ఫేజ్-I): డిసెంబర్ 22, 2024.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ (ఫేజ్-II): జనవరి 19, 2025.
ఇంటర్వ్యూ షెడ్యూల్: ఫిబ్రవరి 2025.