భారత భూభాగంలోని మొత్తం 681 హిమనదాలలో 432 వేగంగా కరగడం వల్ల 2025 జూన్‌లో హిమనద సరస్సుల వైశాల్యం (మొత్తం 1435 హెక్టార్లు) పెరిగిందని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) తాజా నివేదిక వెల్లడించింది. 2011లో 1917 హెక్టార్లుగా ఉన్న హిమనద సరస్సుల విస్తీర్ణం ఇప్పుడు 2508 హెక్టార్లకు విస్తరించిందని తెలిపింది. ఈ హిమనదాలు లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచలప్రదేశ్‌లలో ఉన్నాయి.