Published on Jun 7, 2025
Walkins
సీడాక్‌లో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులు
సీడాక్‌లో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులు

పుణెసెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌) ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ తదితర పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08. 

వివరాలు:

1. మిషన్‌ కో ఆర్డినేటర్‌- 01 

2. ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌: 02  

3. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌: 02  

4. డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌: 01 

5. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌-ఫైనాన్స్‌: 01 

6. సీనియర్‌ మేనేజర్‌- అడ్మిన్‌: 01 

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు మిషన్‌ కో ఆర్డినేటర్‌కు రూ.2,80,000; ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పోస్టులకు రూ.2,50,000; ఇతర పోస్టులకు రూ.1,50,000.

వయోపరిమితి: మిషన్‌ కో ఆర్డినేటర్‌కు 63ఏళ్లు; ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పోస్టులకు 56ఏళ్లు; ఇతర పోస్టుకలు 50ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: గూగుల్‌ లింక్‌ ద్వారా జూన్‌14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

ఇంటర్వ్యూ తేదీలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌కు జూన్‌ 20న; ఇతర పోస్టులకు జూన్‌ 19వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Website:https://cdac.in/index.aspx?id=current_jobs