Published on Jun 25, 2025
Current Affairs
సీడీఎస్‌
సీడీఎస్‌

త్రివిధ దళాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకుగాను ఇకపై అన్ని సర్వీసులకు ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అప్పగించారు.

ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏ విభాగానికి ఆ విభాగం ఆదేశాలు, సూచనలు జారీచేసే విధానానికి ఇది భిన్నం.

సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల మధ్య చక్కటి సమన్వయం, ఉమ్మడితత్వం పెంచడానికి ఏకీకృత నమూనాను (థియేటరైజేషన్‌ మోడల్‌) రూపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మూడు సర్వీసులకు సీడీఎస్‌తోపాటు సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉమ్మడిగా సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారని తెలిపింది.