దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా రాజధాని దిల్లీ మరోసారి నిలిచినట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదిక వెల్లడించింది.
2024-25 చలికాలంలో ఒక క్యూబిక్ మీటరుకు పీఎం 2.5 సాంద్రతతో 175 మైక్రోగ్రాముల కాలుష్య కారకాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. అయితే 2023-24 చలికాలంతో పోలిస్తే ఇది తక్కువేనని పేర్కొంది.
ఈ జాబితాలో రెండో స్థానంలో కోల్‌కతా నిలిచింది. అక్కడ ఈ చలికాలంలో పీఎం 2.5 సాంద్రతతో క్యూబిక్ మీటరుకు 65 మైక్రోగ్రాముల కాలుష్యకారకాలు ఉన్నట్లు గుర్తించారు.