ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్’ సంస్థ ఇటీవల ప్రయోగించిన భారీ స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ నింగిలోకి దూసుకెళ్లి, ఆ తర్వాత లాంచ్‌ప్యాడ్ (లాంచ్‌టవర్)కే సురక్షితంగా చేరుకుంది. ప్రస్తుత ప్రయోగంలో భాగంగా- టెక్సాస్‌లో మెక్సికో సరిహద్దుకు సమీపం నుంచి 2024, అక్టోబరు 13న రెండు దశల (బూస్టర్, వ్యోమనౌక) స్టార్‌షిప్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దాని పొడవు 121 మీటర్లు. అందులోని బూస్టర్ పొడవు 71 మీటర్లు.
నింగిలోకి ఎగిరిన 7 నిమిషాల తర్వాత బూస్టర్ కిందకు దిగుతూ లాంచ్‌టవర్‌కు తిరిగొచ్చింది. చాప్‌స్టిక్స్‌లా పనిచేసే తన భారీ మరహస్తాలతో లాంచ్‌టవర్ దాన్ని పదిలంగా ఒడిసిపట్టి చరిత్ర సృష్టించింది. మరోవైపు- స్టార్‌షిప్ రాకెట్‌తో నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక తన ప్రయాణాన్ని కొనసాగించి, హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది.