న్యూదిల్లీలోని ప్రభుత్వ నవరత్న సంస్థ- సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్: 10 పోస్టులు
విభాగాలు: లీగల్, లెర్నింగ్ అండ్ డెవెలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్, మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవెలప్‌మెంట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిప్లొమా, పీజీ, ఎంఎస్సీ/బీఎస్సీ, బీబీఏ, ఎంఏ, ఎంబీఏ, ఎంటెక్, పీజీడీఎం, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000- రూ.60,000.
గరిష్ఠ వయో పరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్, న్యూదిల్లీ, అహ్మాదాబాద్, బోపాల్, గువాహటి, కొచ్చి, పంచకుల.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.11.2025.
Website:http://https//cewacor.nic.in/