సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. 1961 అప్రెంటిస్ చట్టం ప్రకారం ఈ నియామకాలు జరగనున్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య: 106
వివరాలు:
అర్హతలు: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. & సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ (ITI) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: మార్చి 10, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ & ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: 10వ తరగతి & ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.100 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుబీడీ (PwBD), మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10, 2026 ఉదయం 11:00 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 9, 2026 సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తాయి.
Website:https://rrccr.etrpindia.com/rrccrapprentice/applicationIndex