న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్‌ఆర్‌ఐ) సైంటిఫిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 23
వివరాలు:
సైంటిస్ట్ గ్రేడ్-4
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,35,000 సుమారుగా.
ఎంపిక ప్రక్రియ: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 26-12-2024.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 25-01-2025.
Website:https://crridom.gov.in/recruitment
Online application:https://devapps.ngri.res.in/CrriSci2024/