Published on Jan 31, 2025
Government Jobs
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్‌ ఆఫీసర్ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్‌ ఆఫీసర్ పోస్టులు

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ) రెగ్యులర్‌ ప్రాతిపదికన క్రెడిట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టులు: 1000 (ఎస్సీ- 150; ఎస్టీ- 75; ఓబీసీ- 270; ఈడబ్ల్యూఎస్‌- 100; జనరల్- 405)

వివరాలు:

గ్రేడ్‌/ స్కేల్‌: జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌/ స్కేల్‌-1 (JMGS 1)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ 55 శాతం) ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ వారికి ఐదేళ్లు; ఓబీసీకి మూడేళ్లు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది).

పే స్కేల్: నెలకు రూ.48,480 - రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.750, జీఎస్‌టీ(ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175, జీఎస్‌టీ).

పరీక్ష విధానం: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రిజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌ (రిలేటెడ్‌ బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ) సబ్జెక్టుల నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కుల చొప్పున  ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎస్సై పరీక్ష రెండు ప్రశ్నలకు 30 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 20.02.2025.

Website:https://centralbankofindia.co.in/en

Apply online:https://ibpsonline.ibps.in/cbicojan25/