Published on Jun 8, 2025
Apprenticeship
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్‌ పోస్టులు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్‌ పోస్టులు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ యాక్ట్‌ 1961 ప్రకారం అప్రెంటిస్ పోస్టులకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 4500

వివరాలు:

వ్యవధి: 12 నెలలు (ఒక సంవత్సరం).

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు 01.01.2021 తర్వాత డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

తప్పనిసరిగా NATS పోర్టల్ (https://nats.education.gov.in) లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.

వయోపరిమితి: 31.05.2025 తేదీ నాటికి 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. (అభ్యర్థులు 31.05.1997 - 31.05.2005 మధ్య జన్మించి ఉండాలి). ఎస్సీ/ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు సడలింపు ఉంటుంది. 

స్టైపెండ్: నెలకు రూ.15,000. 

దరఖాస్తు ఫీజు (18% GST తో పాటు): జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800. పీడీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.600.

ఎంపిక విధానం:

ఆన్‌లైన్ రాత పరీక్ష - మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (మానసిక నైపుణ్యం, క్వాంటిటేటివ్, కంప్యూటర్, ఇంగ్లిష్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్)

ప్రాంతీయ భాష నైపుణ్య పరీక్ష

డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23 జూన్ 2025.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 25 జూన్ 2025.

పరీక్ష తేదీ: జూలై మొదటి వారంలో (అంచనా).

Website: https://centralbankofindia.co.in/en/recruitments