Published on Nov 28, 2025
Government Jobs
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెక్నీషియన్‌ పోస్టులు
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం లఖ్‌నవూలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్‌ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో టెక్నీషియన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 44.

వివరాలు:

టెక్నికల్‌ అసిస్టెంట్‌: 12 

టెక్నీషియన్‌-1: 32 

అర్హతలు: టెక్నీషియన్‌కు టెన్త్‌, ఐటీఐ ఉత్తీర్ణత, టెక్నికల్‌ అసిస్టెంట్‌కు  సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.67,530; టెక్నీషియన్‌కు రూ.36,918. 

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2025.

Website:https://cdri.res.in/