Published on Sep 18, 2024
Government Jobs
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) డిసెంబర్‌-2024
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) డిసెంబర్‌-2024

డిసెంబర్‌-2024 ఏడాదికి సంబంధించిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్​ విడుదలైంది. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది.

వివరాలు:

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) డిసెంబర్‌-2024

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

అర్హతలు: పన్నెండో తరగతి, డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/ డీఈడీ (ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), బీఈఎల్‌ఈడీ/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 16.10.2024.

ఫీజు చెల్లింపున‌కు చివరి తేది: 16.10.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 21.10.2024 నుంచి 25.10.2024 వరకు.

ఓఎమ్మార్‌ ఆధారిత పరీక్ష తేదీ: 01-12-2024.

ఫలితాల వెల్లడి: జనవరి, 2025.

Website:https://ctet.nic.in/

Apply online:https://examinationservices.nic.in/examsysctet/root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFfEytN2I3LFrLvNrMJcZJNnx30PznCVoaU9e1Vfdia78