ఘజియాబాద్ (యూపీ)లోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19.
వివరాలు:
1. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 12 పోస్టులు
2. టెక్నీషియన్ ‘బి’: 07 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెషినిస్ట్), డిప్లొమా/ బీఎస్సీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయో పరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.22250- 75000. టెక్నీషియన్ ‘బి’కి రూ.19000- 60000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్/ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.12.2024.
Website:https://celindia.net/
Apply online:https://www.celindia.co.in/career-opportunity