అమెరికాలోని దక్షిణ టెక్సాస్‌లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని అధికారికంగా ఒక నగరంగా ప్రకటించారు. దీనికి స్టార్‌బేస్ అని పేరు పెట్టారు. దీన్ని లాంఛనంగా నగరంగా గుర్తించడానికి తాజాగా స్థానికుల్లో ఓటింగ్ జరిగింది. దీనికి అనుకూలంగా 212 ఓట్లు, వ్యతిరేకంగా 6 ఓట్లు వచ్చాయి.
ఈ ప్రదేశం టెక్సాస్ రాష్ట్రంలో.. మెక్సికో సరిహద్దుకు చేరువలో ఈ నగరం ఉంది. దీని విస్తీర్ణం 3.9 కిలోమీటర్లే. ఈ నగరంలో ఒక మేయర్, ఇద్దరు కమిషనర్లు ఉంటారు. నగర ప్రణాళిక, పన్నుల వసూలు, స్థానిక అంశాలపై స్థానిక ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.