Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 14, 2026
Current Affairs
స్టార్టప్‌ ఇండియా 2.0
స్టార్టప్‌ ఇండియా 2.0
  • స్టార్టప్‌ ఇండియా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ పథకం రెండో దశ (2.0)కు రూ.10,000 కోట్ల మూలనిధితో ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. ప్రారంభ దశల్లో, డీప్‌-టెక్‌ పరిశోధనల్లో ఉన్న అంకుర సంస్థలకు ఇది ప్రోత్సాహం ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • ప్రధాన మంత్రి నూతన కార్యాలయం ‘సేవా తీర్థ్‌’లో మొదటి రోజున పేదలు, అణగారిన వర్గాలు, రైతులు, యువ శక్తి, నారీ శక్తికి సంబంధించిన దస్త్రాలపై మోదీ సంతకం చేశారు. స్టార్టప్‌ ఇండియా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ 2.0కు ఆమోదం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోడీ తెలిపారు.