స్ట్రాటోఆవరణ ఎయిర్‌షిప్ ప్లాట్‌ఫామ్‌ను భారత్ 2025, మే 3న తొలిసారిగా గగనతలంలో పరీక్షించింది. దీనివల్ల సైనిక నిఘా సామర్థ్యానికి ఊతం లభిస్తుంది. ఇలాంటి సంక్లిష్ట సాధనాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం అతికొద్ది దేశాలకే ఉంది. తాజా పరీక్ష మధ్యప్రదేశ్‌లోని షియోపుర్‌లో జరిగింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దీన్ని చేపట్టింది. స్ట్రాటోఆవరణంలో చాలా ఎక్కువసేపు ఉండగలిగే వ్యవస్థల సాధన దిశగా ఇది ముందడుగు అని డీఆర్‌డీవో పేర్కొంది.