టెక్ దిగ్గజాలు ఓపెన్ ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా స్టార్‌గేట్ అనే ఒక భారీ కృత్రిమ మేధ (ఏఐ) ప్రాజెక్టును చేపట్టాయి.
దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025, జనవరి 22న ఆవిష్కరించారు. ఈ వెంచర్ ద్వారా ప్రాణాంతక క్యాన్సర్‌ను నయం చేసే ప్రయోగాలను, ఇతర నూతన ఆవిష్కరణలను చేయనున్నాయి.
వ్యక్తులకు సోకిన క్యాన్సర్ ఏ రకమో గుర్తించిన 48 గంటల్లోనే ఏఐ సాయంతో టీకాను తయారు చేసి ఇవ్వొచ్చని ఈ కంపెనీలు పేర్కొన్నాయి.
ఇందుకోసం టెక్సాస్‌లో 10 డేటా సెంటర్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే వీటి సంఖ్యను 20కి పెంచనున్నారు.