2013 నుంచి 2024 మధ్య కాలంలో భారతీయ ఏఐ రంగంలోకి 11.29 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తాజా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా 470.9 బి.డాలర్లు, చైనా 119.3 బి.డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. యూకే 28.2 బి.డాలర్లను 2024లోనే సంపాదించింది.
నివేదికలోని అంశాలు:
* ఏఐ నిపుణుల నియామకాలు, సాంకేతికత అభివృద్ధి కార్యకలాపాల్లో భారత్ ఎంతో క్రియాశీలకంగా ఉందని కానీ, ప్రైవేట్ రంగం నుంచి ఏఐ పెట్టుబడులు సాధించడంలో భారత్ వెనకబడి ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
* అంకురాల విషయంలోనూ భారత్ ఏమంత ఆశాజనకంగా లేదు. 2024లో కేవలం 74 ఏఐ స్టార్టప్‌లే ఇక్కడ ఆవిర్భవించాయి. అమెరికాలో 1,073, యూకేలో 116, చైనాలో 98 అంకురాలు వచ్చాయి.