Published on Jul 27, 2024
Government Jobs
స్టేట్ బ్యాంకులో ఆఫీసర్‌/ క్లరికల్‌ ఖాళీలు
స్టేట్ బ్యాంకులో ఆఫీసర్‌/ క్లరికల్‌ ఖాళీలు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్పోర్ట్స్‌ కోటాలో ఆఫీసర్, క్లరికల్‌ స్టాఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 68

వివరాలు:

1. ఆఫీసర్‌: 17

2. క్లరికల్‌ స్టాఫ్: 51

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ క్రీడల్లో సాధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.

జీతం: నెలకు ఆఫీసర్‌ పోస్టుకు రూ.85,920, క్లరికల్‌ స్టాఫ్‌ పోస్టుకు రూ.64,840.

గరిష్ఠ వయోపరిమితి: ఆఫీసర్‌ పోస్టుకు 30 ఏళ్లు, క్లరికల్‌ పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌,  ప్రాక్టికల్‌ అసెస్‌మెంట్ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-08-2024.

Website:https://sbi.co.in/

Apply online:https://recruitment.bank.sbi/crpd-sports-2024-25-7/apply