Published on Nov 22, 2024
Current Affairs
సంజయ్‌మూర్తి
సంజయ్‌మూర్తి

కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా ఉన్నత విద్య మాజీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు.

2024, నవంబరు 21న దిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆధ్వర్వంలº ఆయన ప్రమాణస్వీకారం చేశారు.

ప్రస్తుత కాగ్‌ అధిపతి గిరిశ్‌ చంద్ర ముర్ము పదవీకాలం నవంబరు 20న ముగిసింది. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి ఘనత సాధించారు. 

సంజయ్‌ 1964 డిసెంబరు 24న జన్మించారు. 1989లో ఐఏఎస్‌ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికై, ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 

2021 సెప్టెంబరు నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా సేవలందించారు.