భారత యువ వెయిట్ లిఫ్టర్ సంజన ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు సాధించింది.
2024, డిసెంబరు 23న దోహాలో జరిగిన మ్యాచ్‌లో 76 కేజీల విభాగంలో ఆమె స్నాచ్‌లో 90 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 120 కేజీల బరువులెత్తి రెండు పతకాలు గెలుచుకుంది.
ఈ టోర్నీలో ఇప్పటికే జ్యోష్న సబర్, పాయల్ స్వర్ణాలు సాధించగా; కోయల్ బార్, నీలమ్ దేవి రజతాలు గెలిచారు.