దేశ సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 2024, అక్టోబరు 24న నియమితులయ్యారు.
తన పదవీ కాలం నవంబరు 10న ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ఇటీవల సిఫార్సు చేశారు.
ఇందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబరు 11న ప్రమాణం చేయనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. 2025 మే 13 వరకు జస్టిస్ ఖన్నా సీజేఐగా కొనసాగుతారు.
1960 మే 14న జన్మించిన సంజీవ్ ఖన్నా దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు.