Published on Mar 11, 2025
Current Affairs
సీజీఎఫ్‌ ఇక కామన్వెల్త్‌ స్పోర్ట్‌
సీజీఎఫ్‌ ఇక కామన్వెల్త్‌ స్పోర్ట్‌

కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) తన పేరును కామన్వెల్త్‌ స్పోర్ట్‌గా మార్చుకుంది. 2025, మార్చి 10న కామన్వెల్త్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రకటన చేసింది.

గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్‌ క్రీడలను పురస్కరించుకుని కింగ్స్‌ బాటన్‌ రిలేను బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో కింగ్‌ ఛార్లెస్‌ ప్రారంభించారు.

500 రోజుల కౌంట్‌డౌన్‌తో ఈ రిలేను మొదలుపెట్టారు. 74 దేశాల గుండా రిలే సాగనుంది.