Published on Dec 28, 2024
Current Affairs
సచిన్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం
సచిన్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను మెల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఘనంగా సత్కరించింది.

1838లో ఏర్పాటైన ఈ ప్రతిష్టాత్మక క్లబ్‌లో సచిన్‌కు గౌరవ సభ్యత్వం అందజేసింది.

మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన రికార్డు సచిన్‌ పేరిట ఉంది.

5 టెస్టుల్లో 44.90 సగటు, 58.69 స్ట్రైక్‌ రేటుతో సచిన్‌ 449 పరుగులు సాధించాడు.