Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 12, 2026
Current Affairs
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డి.కృష్ణ భాస్కర్‌ను రిలీవ్‌ చేసింది. బుద్ధప్రకాశ్‌ ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఈయన్ను సీఎండీగా నియమిస్తూ 2026, ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.