సింగరేణి సంస్థకు ఇన్‌ఛార్జి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్‌ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ 2025, డిసెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ట్రాన్స్‌కో సీఎండీగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ ఈ పోస్టులో కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది.
ఇంతకాలం ఇన్‌ఛార్జి సీఎండీగా ఉన్న బలరాంను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.