మధ్యప్రదేశ్‌లోని సాగర్ ప్రాంతంలో 10,000 ఏళ్లనాటి రాతి పెయింటింగ్‌లు లభ్యమయ్యాయి. సాగర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని మధియా గౌడ్ అనే గ్రామంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలకు ఇవి లభ్యమయ్యాయి. మానవాభివృద్ధి వివిధ దశలను ఇవి సూచిస్తున్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. వేల ఏళ్ల కిందటే భాష, లిపి అభివృద్ధి చేసినట్లు అనిపిస్తోందని వారు వివరించారు. అప్పట్లో కమ్యూనికేషన్ కోసం మానవులు ఈ పెయింటింగ్‌లను వాడుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు.